నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా - నే చెప్పగలనా
దాయనా - నే దాయగలనా (2)
అయ్యా... నా యేసయ్యా
నాదం - తాళం - రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)
ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2)
||గలనా||
ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2)
||గలనా||
