Praise

నమ్మకమైన నా ప్రభు

Nammakamaina Naa Prabhu

Watch on YouTube
నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును - నిన్ను నే స్తుతింతును ||నమ్మకమైన|| కరుణతోడ పిల్చియు - స్థిరపరచి కాపాడిన స్థిరపరచి కాపాడిన స్థిరపరచిన నా ప్రభున్ పొగడి నే స్తుతింతును (2) ||నమ్మకమైన|| ఎన్నో సార్లు నీ కృపన్ - విడచియుంటినో ప్రభు విడచియుంటినో ప్రభు మన్ననతోడ నీ దరిన్ చేర్చి నన్ క్షమించితివి (2) ||నమ్మకమైన|| కృంగియుండు వేళలో - పైకి లేవనెత్తితివి పైకి లేవనెత్తితివి భంగ పర్చు సైతానున్ గెల్చి విజయమిచ్చితివి (2) ||నమ్మకమైన|| నా కాశ్రయశైలమై - కోటగా నీవుంటివి కోటగా నీవుంటివి ప్రాకారంపు ఇంటివై నన్ను దాచియుంటివి (2) ||నమ్మకమైన|| సత్య సాక్షివై యుండి - నమ్మదగినవాడవై నమ్మదగినవాడవై నిత్యుడౌ మా దేవుడా ఆమేనంచు పాడెద (2) ||నమ్మకమైన||