Good Friday

నాకు చాలిన దేవుడ నీవు

Naaku Chaalina Devuda Neevu

Watch on YouTube
నాకు చాలిన దేవుడ నీవు నా కోసమే మరణించావు (2) నా శ్రమలలో నా ఆధారమా నను ఎడబాయని నా దైవమా (2) ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను ఏ రీతిగా నిను స్తుతియించగలను (2) ||నాకు చాలిన|| వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె మౌనివై నా పాప శిక్షణోర్చినావు (2) అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా (2) చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2) ||ఏమిచ్చి|| ఎండిన భూమిలో లేత మొక్క వోలె నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా (2) సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో (2) నడవలేక సుడి వడి కూలినావయ్యా (2) ||ఏమిచ్చి||