Worship

నాదు జీవమాయనే నా సమస్తము

Naadhu Jeevamaayane Naa Samasthamu

Watch on YouTube
నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వమేసుకే నాదు జీవము నాదు దైవము - దివి దివ్య తేజము (2) ||నాదు|| కృంగిన వేళ - భంగపడిన వేళ - నా దరికి చేరెను చుక్కాని లేని - నావ వలె నేనుండ - అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను - ఆలోచన చెప్పెను (2) ||నాదు|| సాతాను బంధీనై - కుములుచున్న వేళ - విడిపించెను శ్రీ యేసుడు రక్తమంత కార్చి - ప్రాణాన్ని బలిచేసి - విమోచన దయచేసెను సాతానుని అణగద్రొక్కన్ - అధికారం బలమిచ్చెను (2) ||నాదు|| కారు మేఘాలెన్నో - క్రమ్మిన వేళ - నీతిసుర్యుడు నడుపును తూఫానులెన్నో - చెలరేగి లేచిననూ - నడుపును నా జీవిత నావ త్వరలో ప్రభు దిగివచ్చును - తరలి పోదును ప్రభునితో (2) ||నాదు||