నా తండ్రి నన్ను మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరు (2)
లోకం నాదే అని నిన్ను విడిచాను
ఘోర పాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
నీదు బిడ్డగా పెరిగి - నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచినా ఈ లోకం - నన్నెంతో మురిపించింది (2)
నీ బంధం తెంచుకొని - దూరానికే పరిగెత్తాను
నే నమ్మిన ఈ లోకం - శోకమునే చూపించింది
||లోకం||
నీ కన్నులు నా కొరకు - ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ఈ ప్రేమ - ఎక్కడ కనరాలేదు (2)
నే చనిపోయి బ్రతికానని - తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే - నీ ప్రేమా ఎంతో చూపితివే
||నా తండ్రి||
