Worship

నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా

Naa Sankata Duhkhamulella Theeripoyegaa

Watch on YouTube
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2) ||నా సంకట|| విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2) కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2) ||నా సంకట|| ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2) ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2) ||నా సంకట|| మార్చబడు నాడు మారా మధురముగా (2) పారు జలము బండనుండి త్రాగుచుండును (2) ||నా సంకట|| సౌందర్యమయమగు పరమ కానాను (2) నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2) ||నా సంకట|| ఆనందమే పరమానందమే (2) కానాను జీవితము నా కానందమే (2) ||నా సంకట|| నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు (2) నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2) ||నా సంకట|| నా యేసు ప్రభువే నా బలము గానము (2) నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2) ||నా సంకట||