Devotional

నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా

Naa Praana Priyudaa Naa Yesayyaa

Watch on YouTube
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నను గన్న తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజియింతును ఓ భవదీయుడా నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2) నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ|| ఒంటరినై తోడులేక దూరమైతిని ఓదార్చే వారు లేక భారమైతిని (2) తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని (2) నీ తోడు దొరికాక చిగురించితిని (2) ||నీవు గాక|| శత్రువుల చేతులలో చిక్కుకొంటిని సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2) తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక|| క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురంగా ఎంచుకుంటిని (2) తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని (2) నా కొరకు నీవు నీ కొరకు నేను (2) ||నీవు గాక||