నా జీవిత వ్యధలందు యేసే జవాబు
యేసే జవాబు - ప్రభు యేసే జవాబు (2)
||నా జీవిత||
తీరని మమతలతో ఆరని మంటలలో
ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2)
నను గని వచ్చెను - తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము బాపెను
||నా జీవిత||
చీకటి వీధులలో నీటుగా నడచితిని
లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2)
నను గని వచ్చెను - తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము బాపెను
||నా జీవిత||
హంగుల వేషముతో రంగుల వలయములో
నింగికి నేనెగిరి నేలను రాలితిని (2)
నను గని వచ్చెను - తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి - కలుషము బాపెను
||నా జీవిత||
