Worship

నా గీతారాధనలో యేసయ్యా

Naa Geethaaradhanalo Yesayyaa

Watch on YouTube
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ - (2) ||నా గీతా|| నీ కృప నాలో వ్యర్ధము కాలేదు - నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో - మొలవనివ్వలేదులే (2) నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టెనే (2) ||నా గీతా|| చేనిలోని పైరు చేతికి రాకున్నా - ఫలములన్ని రాలిపోయినా సిరి సంపదలన్ని దూరమై పోయినా - నేను చలించనులే (2) నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) ||నా గీతా|| ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో - నిండుగా కుమ్మరించెనే ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో - ఫలింపజేసెనే (2) ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీ రాకడకై (2) ||నా గీతా||