Encouragement

నా దీపము యేసయ్యా

Naa Deepamu Yesayyaa

Watch on YouTube
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - (2) ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2) చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2) మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2) పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||