Good Friday

నా చెలిమి కోరి - నీ కలిమి వీడి

Naa Chelimi Kori - Nee Kalimi Veedi

Watch on YouTube
నా చెలిమి కోరి - నీ కలిమి వీడి నా చెంత చేరావు శ్రీమంతుడా నా రక్షణ కొరకై - ఆ శిక్షను పొంది బలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి|| ద్రోహినై దూరమైతిని - పాపినై పరుగులెడితిని గమ్యమే ఎరుగనైతిని - మరణమే శరణమాయెను ఎంతో ప్రేమించితివి - నా స్థానమందు నిలిచితివి కృపతో నన్ రక్షించితివి - నా దోషశిక్ష భరించితివి ||నా చెలిమి|| నిందలు అవమానములు - హేళనలు చీత్కారములు కఠిన దెబ్బలు ముళ్లపోటులు - సిలువ భారం కాయమంతా గాయం హృదినే బాధించినా - భరియించావు వేదన మౌనముగా తనువే తల్లడిల్లినా - తృప్తినొందావు నను తలచుకొని ||నా చెలిమి|| ఏ రీతి నిన్ను - కీర్తించగలను నా నీతి నీవే ఓ యేసుదేవా నీ సాక్షిగ నిలిచి - నీ ప్రేమను చాటి ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా