Repentance

మూడునాళ్ళ ముచ్చట కోసం

Moodunaalla Muchchata Kosam

Watch on YouTube
మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా (2) నీటిబుడగలాంటి జీవితం ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2) మనిషికి తన మనసే చేరసాలరా మమతలు మమకారాలే బంధాలురా (2) వల్లకాటి వరకేరా భవబంధాలు అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2) కల్లలైన కళలు మానుకో ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ|| ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము అది కనిపించీ మాయమయే రంగులవలయం (2) గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2) నిత్యమైన సుఖము వెదకరా నిరతము ఆ ప్రభుని వేడరా (2) ||మూడునాళ్ళ|| తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2) జిగటగల ఊభినుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2) తీర్పు తీర్చబడకమునుపే తప్పక ఆ ప్రభుని కోరరా (2) ||మూడునాళ్ళ||