Second Coming

మేలుకో మహిమ రాజు

Meluko Mahima Raaju

Watch on YouTube
మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు (2) పరమునుండి - బూర ధ్వనితో అరయు నేసు - ఆర్భాటముతో (2) సర్వలోకము - తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో|| గురుతులెల్ల - ధరణియందు సరిగ చూడ - జరుగుచుండ (2) చిరునవ్వుతో - చేరి ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో|| క్రీస్తునందు - మృతులెల్లరు కడబూర - మ్రోగగానే (2) క్రీస్తువలె - తిరిగి లేతురు లేతువా? నీవు ప్రియుడా (2) ||మేలుకో|| అరయంగ - పరిశుద్ధులు మురిసెదరు - అక్షయ దేహులై (2) పరమందు - ప్రభుక్రీస్తు నిరతము - ఓ ప్రియుండా (2) ||మేలుకో|| కరుణలేని - ఓ మరణమా నిరతము నీకు జయమగునా (2) మరణ సంహా - రుండేసు త్వరగా - రానై యున్నాడు (2) ||మేలుకో|| మాంసలోక - పిశాచాదులు హింస పరచ - విజృంభించిన (2) లేశమైనను - జడియకుము ఆశతో - కాచుకొనుము (2) ||మేలుకో|| పాపమును - చేయకుమా రేపకుమా - దైవ కోపమును (2) శాపమును - తప్పుకొని శ్రద్ధతో - కాచుకొనుమా (2) ||మేలుకో||