Faith

మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా

Melaina Keedaina Neethone Yesayyaa

Watch on YouTube
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2) నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా|| కలిమి చేజారి నను ముంచినా స్థితిని తలక్రిందులే చేసినా (2) రెండింతలుగా దయచేసెదవని (2) నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| పరుల ఎగతాళి శృతి మించినా కలవరము పొంది నే కృంగినా (2) నా మొర విని కృప చూపెదవని (2) నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటునే తెచ్చినా (2) ఆపదలలో విడిపించెదవని (2) నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||