మేఘాల పైన మన యేసు
త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2)
సిద్ధపడుమా ఉల్లసించుమా
నీ ప్రియుని రాకకై (2)
||మేఘాల||
ఏ ఘడియో ఏ వేళయో - తెలియదు మనకు
బుద్ధి కలిగిన కన్యకలు వలె - సిద్ధపడియుండు (2)
బూర శబ్దం మ్రోగగా
ప్రభుని రాకడ వచ్చును
రెప్ప పాటున పరిశుద్ధులు
కొనిపోబడుదురు ప్రభువుతో
||మేఘాల||
పాపం వలన వచ్ఛు జీతం - మరణమే కాదా
దేవుని కృపయే క్రీస్తు యేసులో - నిత్య జీవమే (2)
వినుట వలన విశ్వాసం
కలుగును సోదరా
దేవుని ఆజ్ఞకు లోబడితే
పొందెదవు పరలోకం
||మేఘాల||
స్తుతియు మహిమ ఘనత ప్రభావం
యేసుకే చెల్లు గాక
తర తరములకు యుగయుగములు
యేసే మారని దైవం (2)
నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట
నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ
||మేఘాల||
