Christmas

మంగళమే యేసునకు మానుజావతారునకు

Mangalame Yesunaku Maanujaavathaarunaku

Watch on YouTube
మంగళమే యేసునకు - మానుజావతారునకు (3) శృంగార ప్రభువునకు (2) క్షేమాధిపతికి మంగళమే ||మంగళమే|| పరమ పవిత్రునకు - వర దివ్య తేజునకు (3) నిరుపమానందునకు (2) నిపుణ వేద్యునకు మంగళమే ||మంగళమే|| దురిత సంహారునకు - వర సుగుణోదారునకు (3) కరుణా సంపన్నునకు (2) జ్ఞాన దీప్తునకు మంగళమే ||మంగళమే|| సత్య ప్రవర్తునకు - సద్ధర్మ శీలునకు (3) నిత్య స్వయంజీవునకు (2) నిర్మలాత్మునకు మంగళమే ||మంగళమే|| యుక్త స్తోత్రార్హునకు - భక్త రక్షామణికి (3) సత్య పరంజ్యోతి యగు (2) సార్వభౌమునకు మంగళమే ||మంగళమే|| నర ఘోర కలుషముల - నురుమారంగ నిల (3) కరుదెంచిన మా పాలి (2) వర రక్షకునకు మంగళమే ||మంగళమే|| పరమపురి వాసునకు - నర దైవ రూపునకు (3) పరమేశ్వర తనయునకు (2) బ్రణుతింతుము నిన్ను మంగళమే ||మంగళమే||