Evangelism

మంచిని పంచే దారొకటి

Manchini Panche Dhaarokati

Watch on YouTube
మంచిని పంచే దారొకటి వంచన పెంచే దారొకటి రెండు దారులలో నీ దారి ఎంచుకో బాటసారి సరి చూసుకో ఒక్కసారి (2) మొదటి దారి బహు ఇరుకు - అయినా యేసయ్యుంటాడు ప్రేమా శాంతి కరుణ - జనులకు బోధిస్తుంటాడు (2) పాపికి రక్షణ తెస్తాడు పరలోక రాజ్యం ఇస్తాడు (2) అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా విశాల మార్గం వద్దయ్యా ||మంచిని|| మరియొక దారి విశాలం - కాని సాతానుంటాడు కామం క్రోధం లోభం - నరులకు నేర్పిస్తాడు (2) దేవుని ఎదిరిస్తుంటాడు నరకాగ్నిలో పడదోస్తాడు (2) అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా విశాల మార్గం వద్దయ్యా ||మంచిని||