Worship

మంచి స్నేహితుడా మంచి కాపరివి

Manchi Snehithudaa Manchi Kaaparivi

Watch on YouTube
మంచి స్నేహితుడా మంచి కాపరివి (2) అగాధ జలములలో నేను నడచినను అరణ్య యానములో నేను తిరిగినను నన్ను ఆదరించినావు ఓదార్చినావు చేర దీసినావు కాపాడినావు (2) నీకే ఆరాధన - నీకే ఆరాధన (2) ఆరాధన ఆరాధన - ఆరాధన నీకే ఆరాధన (2) తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచుచున్నావు (2) ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు ||ఆరాధన|| చెరలో ఉన్న నన్ను విడుదల చేసినావు బంధింపబడియున్న నన్ను విముక్తి ప్రకటించినావు (2) నాలో ఉన్న నిన్ను లోకానికి చూపినావు నీలో ఉన్న నన్ను నీ సాక్షిగా నిలిపినావు ||ఆరాధన|| ఒంటరియైన నన్ను వేయిమందిగా చేసితివి ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా మార్చితివి (2) నన్ను హెచ్చించినావు నా కొమ్ము పైకెత్తినావు (2) ||ఆరాధన||