Wedding

మనసులొకటాయే భువిలో

Manasulokataaye Bhuvilo

Watch on YouTube
మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో (2) మనసు పరవశమై మధుర లాహిరిలో (2) మనసులోని భావాలు ఉరకలు వేసే ఈ వేళా ||మనసులొకటాయే|| ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2) ఈ మధురమైన శుభవేళ (2) ఒకరికొకరు తోడు నీడగా సాగే ఈ తరుణం ||మనసులొకటాయే|| అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2) ఘన యేసుని దివ్య ఆశీస్సు (2) జీవితాంతం నిండుగ మెండుగ నీతో నిలిచే ఈ తరుణం ||మనసులొకటాయే||