మనస యేసు మరణ బాధ - లెనసి పడవే
తన - నెనరు జూడవే యా - ఘనుని గూడవే
నిను - మనుప జచ్చుటరసియే - మరక వేడవే
||మనస||
అచ్చి పాపములను బాప - వచ్చినాడట
వా-క్కిచ్చి తండ్రితో నా - గెత్సేమందున
తా - జొచ్చి యెదను నొచ్చి బాధ - హెచ్చుగనెనట
||మనస||
ఆ నిశీధ రాత్రి వేళ - నార్భటించుచు
న-య్యో నరాంతకుల్ చే - బూని యీటెలన్
ఒక - ఖూని వానివలెను గట్టి - కొంచుబోయిరా
||మనస||
పట్టి దొంగవలెను గంత - గట్టి కన్నులన్
మరి - గొట్టి చెంపలన్ వడి - దిట్టి నవ్వుచున్
నిను - గొట్టి రెవ్వరదియు మాకు - జెప్పమనిరట
||మనస||
ముళ్ల తోడ నొక కిరీట - మల్లి ప్రభు తలన్
బెట్టి - రెల్లు కర్రతో నా - కళ్ళ జనములు
రా - జిల్లు మనుచు గొట్టి నవ్వి - గొల్లు బెట్టిరా
||మనస||
మొయ్యలేక సిల్వ భారము - మూర్చ బోయెనా
అ -య్యయ్యో జొక్కెనా యే - సయ్య తూలెనా
మా - యయ్యనిన్ దలంపగుండె - లదరి పోయెనా
||మనస||
కాలు సేతులన్ గుదించి - కల్వరి గిరిపై
నిన్ - గేలి జేయుచు నీ - కాళ్ళ మీదను
నినుప - చీలలతో గృచ్చి నిన్ను - సిల్వ గొట్టిరా
||మనస||
దేవ సుతుడా వైతి వేని - తీవరంబుగా
దిగి - నీవు వేగమే రమ్ము - గావు మనుచును
ఇట్లు - గావరించి పల్కు పగర - కరుణ జూపెనా
||మనస||
తన్ను జంపు శత్రువులకు - దయను జూపెనా
తన - నెనరు జూపెనా ప్రభు - కనికరించెనా
ఓ - జనక యీ జనుల క్షమించు - మనుచు వేడెనా
||మనస||
తాళలేని బాధ లీచ్చి - దాహమాయెనా
న -న్నేలువానికి నా - పాలి స్వామికి
నే -నేల పాపములను జేసి - హింస పరచితి
||మనస||
గోడు బుచ్చి సిలువపైన - నేడు మారులు
మా -ట్లాడి ప్రేమతో నా - నాడు శిరమును
వంచి - నేడు ముగిసె సర్వ మనుచు - వీడె ప్రాణము
||మనస||
మరణమైన ప్రభుని జూచి - ధరణి వణకెనా
బల్ - గిరులు బగిలెనా - గుడి తెరయు జీలెనా
దివా -కరుడు చీకటాయె మృతులు - తిరిగి లేచిరి
||మనస||
ఇంత జాలి యింత ప్రేమ - యింత శాంతమా
నీ - యంత కరుణను నే - జింత చేయగా
నీ - వింత లెల్ల నిత్య జీవ - విధము లాయెనా
||మనస||
