Devotional

మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు

Mahimagala Thandri Manchi Vyavasaayakudu

Watch on YouTube
మహిమగల తండ్రి - మంచి వ్యవసాయకుడు మహితోటలో నర మొక్కలు నాటించాడు (2) తన పుత్రుని రక్తనీరు - తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను - కాపుగా వుంచాడు (2) కాయవే తోటా - కమ్మని కాయలు పండవే చెట్టా - తియ్యని ఫలములు (2) ||మహిమ|| నీతి పూత జాతి కర్త - ఆత్మ సుతా ఫలములు నీ తండ్రి నిలువచేయు - నిత్య జీవ ఫలములు (2) అనంతమైన ఆత్మ బంధ - అమర సుధా కాంతులు (2) అనుకూల సమయమయ్యె - పూయు పరమ పూతలు (2) ||కాయవే|| అపవాది కంటబడి - కుంటుబడి పోకు కాపుకొచ్చి చేదు పండ్లు - గంపలుగా కాయకు (2) అదిగో గొడ్డలి వేరు - పదును పెట్టియున్నది (2) వెర్రిగా చుక్కలనంటి - ఎదిగి విర్రవీగకు (2) ||కాయవే|| కలువరి కొండలో పుట్టి - పారిన కరుణా నిధి కలుషమైన చీడ పీడ - కడిగిన ప్రేమానిధి (2) నిజముగాను నీవు - నీ సొత్తు కావు (2) యజమాని వస్తాడు - ఏమి ఫలములిస్తావు (2) ||కాయవే|| ముద్దుగా పెంచాడు - మొద్దుగా నుండకు మోదమెంతో ఉంచాడు - మోడుబారి పోకు (2) ముండ్ల పొదలలో కృంగి - మెత్తబడి పోకు (2) పండ్లు కోయ వచ్చువాడు - అగ్నివేసి పోతాడు (2) ||కాయవే||