Faith

మాటే చాలయ్యా యేసూ నాకు

Maate Chaalayyaa Yesu Naaku

Watch on YouTube
మాటే చాలయ్యా యేసూ నాకు నీ మాటలోనే జీవం ఉన్నది (2) నీ మాట వల్లె జరుగును అద్భుతాలు నీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు (2) నీ మాటకు సమస్తం సాధ్యమే (2) ||మాటే|| సృష్టికర్తవు నీవే - సమస్తము సృజియించితివి సృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది (2) నీ మాటకు శక్తి ఉన్నదయ్యా నీ మాటకు సమస్తం లోబడును (2) ||నీ మాట వల్లె|| పరమ వైద్యుడవు నీవే - స్వస్థపరచు దేవుడవు దయ్యములన్ని నీ మాటకు లోబడి వొణుకును (2) నీ మాటలో స్వస్థత ఉందయ్యా నీ మాటతోనే విడుదల కలుగును (2) ||నీ మాట వల్లె|| జీవాధిపతి నీవే - జీవించు దేవుడవు నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది (2) నీ మాటలో జీవం ఉందయ్యా నీ మాటలే మాకు జీవాహారాము (2) ||నీ మాట వల్లె||