Evangelism

మారిపోవాలి ఈ లోకమంతా

Maaripovaali Ee Lokamantha

Watch on YouTube
మారిపోవాలి ఈ లోకమంతా చేరరావాలి ప్రభుయేసు చెంత (2) మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ (2) పంచుకోవాలి పరవారితో ||మారిపోవాలి|| మనము వెలగాలి ఒక దివ్య వెలుగై (2) వెలిగించాలి ఈ జగతినంతా (2) కదలి రావాలి కరుణంత మనలో (2) కరిగిపోవాలి కఠినాత్ములంతా (2) ||మారిపోవాలి|| మనము బ్రతకాలి విలువైన బ్రతుకు (2) బ్రతికించాలి ప్రభుయేసు బోధ (2) ఆదుకోవాలి నర జాతినంతా (2) అందించాలి ప్రభు వాక్యమెంతో (2) ||మారిపోవాలి|| మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ (2) మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ (2) వినిపించాలి మన సాక్ష్యమంతా (2) కదిలించాలి హృదయాలనంతా (2) ||మారిపోవాలి||