Dedication

మారిన మనసులు మధురం మీకు

Maarina Manasulu Madhuram Meeku

Watch on YouTube
మారిన మనసులు మధురం మీకు అర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు (2) ఇహ లోక కానుకలు అల్పములు మీకు పరలోక ఫలములు ఇచ్చెద మీకు (2) ||మారిన|| నా హృదయ కుసుమమును అప్పము చేసి నా జీవన ప్రవాహమును రసముగ మార్చి (2) సమర్పింతు దేవా నా సర్వస్వమును కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన|| నా జయము అపజయము నీవే దేవా నా సుఖ దుఃఖములన్నియు నీవే కావా (2) సమర్పింతు దేవా నా సర్వస్వమును కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన||