Faith

మార్గములను సృజించువాడు జీవితాలను వెలిగించువాడు

Maargamulanu Srujinchuvaadu Jeevithaalanu Veliginchuvaadu

Watch on YouTube
మార్గములను సృజించువాడు - జీవితాలను వెలిగించువాడు బ్రతుకు నావ నడిపించువాడు - యెహోవాయే నాకుండగా (2) నేను సాధించలేనిది లేనే లేదు - జయించలేనిది లేనే లేదు అసాధ్యమైనది లేనే లేదు - విజయమెప్పుడూ నాదే (2) ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ జలములు నాపైకి లేచిననూ (2) సంకెళ్లు నను బిగదీసిననూ శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను|| జీవితమంతా శూన్యమైననూ బంధువులందరు నను విడచిననూ (2) వ్యాధులెన్నో నను చుట్టిననూ అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను||