మార్గము నీవని - గమ్యము నీవని - (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సుగమమాయెనే జీవ యాత్ర
ప్రాణము నీవని - దేహము నీదని - (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
చైతన్యమొందెనే జీవ యాత్ర
బాధల బరువులో - నిత్య నిరాశలో
శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా (2)
శాంతము నీవని - స్వస్థత నీవని (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
ఆనందమాయెనే జీవ యాత్ర
||మార్గము||
ప్రార్థన వేళలో - ఆద్రత మీరగా
గొంతు మూగదై - భక్తి కన్నుల జాలగా (2)
ధాత్రము నీవని - స్తోత్రము నీవని (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సంగీతమాయెనే జీవ యాత్ర
||మార్గము||
