Devotional

మాధుర్యమే నా ప్రభుతో జీవితం

Maadhuryame Naa Prabhutho Jeevitham

Watch on YouTube
మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే - మహా ఆశ్చర్యమే ||మాధుర్యమే|| సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును - వాడిపోవును ||మాధుర్యమే|| నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయ భక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు ||మాధుర్యమే|| నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే నా రోగమంతయు సిలువలో పరిహరించెను - పరిహరించెను ||మాధుర్యమే|| వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో ||మాధుర్యమే||