మా సర్వానిధి నీవయ్యా
నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
యేసయ్యా... యేసయ్యా...
మా ప్రియమైన యేసయ్యా (2)
||మా సర్వానిధి||
మా పాపములకై కలువరి గిరిపై
నలిగితివా మా ప్రియ యేసయ్యా (2)
విరిగి నలిగిన హృదయాలతో (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2)
||యేసయ్యా||
నీవే మార్గము - నీవే సత్యము
నీవే జీవము - మా యేసయ్యా (2)
జీవపు దాత శ్రీ యేసునాథ (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2)
||యేసయ్యా||
మా స్నేహితుడవు - మా రక్షకుడవు
పరిశుద్ధుడవు - మా యేసయ్యా (2)
పరిశుద్ధమైన నీ నామమునే (2)
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా (2)
||యేసయ్యా||
