Faith
లోకాన ఎదురు చూపులు శోకాన ఎద గాయములు
Lokaana Eduru Choopulu Shokaana Eda Gaayamulu
లోకాన ఎదురు చూపులు
శోకాన ఎద గాయములు
యేసులోన ఎదురు చూపులు
ఫలియించును ప్రభు వాగ్ధానములు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)
||లోకాన||
నిండు నూరేళ్లు అబ్రహాము
ఎదురు చూసాడు విశ్వాసముతో (2)
కన్నాడు పండంటి కుమారుని
పొందాడు వాగ్ధాన పుత్రుని (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)
||లోకాన||
ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని
ఎదురు చూసెను ఉపవాసముతో (2)
చూసింది పరిశుద్ధ తనయుని
సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2)
ఎదురు చూడాలి యేసుకై
నిరీక్షణా ప్రేమతో (2)
||లోకాన||
