లాలి లాలి జోలాలి బాల యేసునకు లాలి
కన్య మరియా తనయునకు పాడ రండి జోలాలి (2)
లోక రక్షకునకు లాలి శాంతి కర్తకు జోలాలి (2)
మాదు తండ్రికి మా లాలి (2)
||లాలి||
చీకటి దొంతరల తెరలకు తెరను దింపగా వచ్చినావని
పాప శాపపు తాపములకు రక్షణను ఇల తెచ్చినావని (2)
మానవుల మోచకుడా లాలి ధరణిపై దైవమా జోలాలి (2)
మాదు తండ్రికి మా లాలి (2)
||లాలి||
దారి తెలియని మానవాళికి దారి నీవై వెలసినావని
మరణ ఛాయలు రూపుమాపగ జీవ కిరణమై మెరిసినావని (2)
సత్య రూపునకు లాలి నీతి సూర్యునకు జోలాలి (2)
మాదు తండ్రికి మా లాలి (2)
||లాలి||
