Devotional
క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
Kreesthuni Swaramu Vindunu Prabhuve Palikinappudu
క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది - (2)
యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2)
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2)
||క్రీస్తుని||
బలమైన నీ స్వరము బహుప్రభావము గలది (2)
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని (2)
||క్రీస్తుని||
అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును (2)
ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును (2)
||క్రీస్తుని||
ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ (2)
ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే (2)
||క్రీస్తుని||
నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ (2)
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు (2)
||క్రీస్తుని||
నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును (2)
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను (2)
||క్రీస్తుని||
నీ మధుర స్వరము నీ మార్గము జూపును (2)
కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును (2)
||క్రీస్తుని||
తుఫానులు కలిగి భయభీతులలో నుండ (2)
భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము (2)
||క్రీస్తుని||
మరణాంధకార లోయలో నేనుండ (2)
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ (2)
||క్రీస్తుని||
ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్ (2)
దీనుడనై నీ మాట అంగీకరించెదను (2)
||క్రీస్తుని||
