Christmas

క్రీస్తు పుట్టెను హల్లెలూయా

Kreesthu Puttenu Hallelooyaa

Watch on YouTube
క్రీస్తు పుట్టెను హల్లెలూయా (2) జగమంతా పండుగాయెను - సర్వలోకానికి సందడాయెను (2) చీకు చింత వీడిపోయె - చీకటంత తొలగిపోయె (2) నవ్యకాంతులెగసె ఇలలో - దివ్యకాంతుడేసు రాకతో… ఉల్లాసమే ఉత్సాహమే - జగమంతా జయోత్సాహమే (2) చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య పాప శాపముతో నిండియుండగా యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో - రక్షణకాంతులే విరజిల్లెను (2) ||చీకు చింత|| గెరాసేను జనములలో కొందరు రోగాలు దయ్యాలతో బాధనొందగా యేసు అడుగుపెట్టెను ఆ ఊరిలో - విడుదలకాంతులే ప్రకాశించెను (2) ||చీకు చింత|| మరణమాయె యాయీరు కూతురు వేదన రోదన కన్నీటిలో యేసు అడుగుపెట్టెను ఆ ఇంటిలో - జీవపుకాంతులే ప్రజ్వలిల్లెను (2) ||చీకు చింత|| వేదనతో నలిగిపోవుచున్నావా యేసు నీ కొరకై ఉదయించెను లెమ్ము తేజరిల్లుమ్ము నీ ఇంటికి - వెలుగు వచ్చియున్నది (2) ||క్రీస్తు పుట్టెను||