Worship

క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి

Kreesthe Sarvaadhikaari Kreesthe Mokshaadhikaari

Watch on YouTube
క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి - క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| ముక్తి విధాత నేత - శక్తి నొసంగు దాత భక్తి విలాప శ్రోత - పరమంబు వీడె గాన ||క్రీస్తే|| దివ్య పథంబురోసి - దైవంబు తోడు బాసి దాసుని రూపు దాల్చి - ధరణి కేతెంచె గాన ||క్రీస్తే|| శాశ్వత లోకవాసి - సత్యామృతంపు రాశి శాప భారంబు మోసి - శ్రమల సహించె గాన ||క్రీస్తే|| సైతాను జనము గూల్పన్ - పాతాళమునకు బంపన్ నీతి పథంబు బెంప - రుధిరంబు గార్చె గాన ||క్రీస్తే|| మృత్యువు ముళ్ళు తృపన్ - నిత్య జీవంబు బెంపన్ మర్త్యాళి భయము దీర్పన్ - మరణంబు గెలిచె గాన ||క్రీస్తే|| పరమందు దివిజులైన - ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు - ప్రభునే భజించు గాన ||క్రీస్తే|| ఈ నామమునకు మించు - నామంబు లేదటంచు యెహోవా తండ్రి యేసున్ - హెచ్చించినాడు గాన ||క్రీస్తే||