Christmas

కొండలలో కోనలలో

Kondalalo Konalalo

Watch on YouTube
కొండలలో కోనలలో బేతలేము గ్రామములో కనిపించె ప్రభు దూత వినిపించేను శుభ వార్త చెలరేగెనే ఆనందము రక్షకుని రాకతో (2) ||కొండలలో|| కొరికేసే చలి గాలిలో వణికించే నడి రేయిలో (2) కాపరుల భయము తీర పామరుల ముదము మీర (2) దూతా గానము శ్రావ్యా రాగము (2) పరమ గీతము ||కొండలలో|| దావీదు పురమందున పశువుల శాలయందున (2) మన కొరకే రక్షకుండు ఉదయించే పాలకుండు (2) రండి వేగమే రండి శీఘ్రమే (2) తరలి వేగమే ||కొండలలో||