Devotional

కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు

Kallundi Choodaleni Endaro Unnaaru

Watch on YouTube
కళ్లుండి చూడలేని ఎందరో ఉన్నారు చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2) వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే జీవింప చేయాలి నీ మహిమలోనే ||కళ్లుండి|| కంటి చూపుతో నన్ను కాచియున్నావు గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2) మరణాన్ని తప్పించావు జీవాన్ని నాకిచ్చావు (2) ఇంకేల నా యేసయ్యా ||కళ్లుండి|| నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2) నీవే నా గమ్యమని నీలోనే నడిచెదను (2) నాకేగా పరలోకము ||కళ్లుండి||