Worship

కలములతో రాయగలమా

Kalamulatho Raayagalamaa

Watch on YouTube
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా (2) ఆరాధింతును (4) రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను (2) ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును|| సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి (2) దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||