జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే - నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే (2)
||జ్యోతి||
నా పరలోకపు తండ్రి - వ్యవసాయకుడా (2)
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటు కట్టి స్థిరపరచావా (2)
||జ్యోతి||
నా పరలోకపు తండ్రి - నా మంచి కుమ్మరి (2)
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై ఉంచావా (2)
||జ్యోతి||
నా తండ్రి కుమారా - పరిశుద్దాత్ముడా (2)
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద (2)
||జ్యోతి||
