Worship

జుంటె తేనె కన్నా తీయనిది

Junte Thene Kannaa Theeyanidi

Watch on YouTube
జుంటె తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్న అది పొంగి పొర్లుచున్న ప్రేమ నీది యేసు నీ నామము సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసు నీ నామము యేసూ అసాధ్యుడవు నీవు మరణాన్నే జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షకా నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ప్రణమిల్లి మ్రొక్కెదము ||జుంటె|| ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించియున్నది ఊహలకందని ఉన్నతమైనది యేసు నీ నామము లోకమంతటికి రక్షణ మార్గము జనులందరిని బ్రతికించు జీవము సర్వ కాలములో నివసించు సత్యము యేసు నీ నామము ||జుంటె||