Worship

హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాథుండు

Hrudayamanedu Thalupu Nodda Yesu Naathundu

Watch on YouTube
హృదయమనెడు తలుపు నొద్ద - యేసు నాథుండు నిలచి - సదయుడగుచు దట్టుచుండు - సకల విధములను (2) ||హృదయ|| పరుని బోలి నిలుచున్నాడు - పరికించి చూడ నతడు - పరుడు గాడు రక్షకుండు - ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ|| కరుణా శీలుండతడు గాన - గాచి యున్నాడు యేసు - కరుణ నెరిగి గారవింప - గరము న్యాయంబు (2) ||హృదయ|| ఎంత సేపు నిలువ బెట్టి - యేడ్పింతు రతని నాత - డెంతో దయచే బిలుచుచున్నా - డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ|| అతడు మిత్రుడతడు మిత్రుం - డఖిల పాపులకు మీర - లతని పిలుపు వింటి రేని - యతడు ప్రియుడగును (2) ||హృదయ|| జాలి చేత దన హస్తముల - జాపి యున్నాడు మిమ్ము - నాలింగనము సేయ గోరి - యనిశము కనిపెట్టు (2) ||హృదయ|| సాటిలేని దయగల వాడు - సర్వేశు సుతుడు తన - మాట వినెడు వారల నెల్ల - సూటిగ రక్షించు (2) ||హృదయ|| చేర్చుకొనుడి మీ హృదయమున - శ్రీ యేసునాథు నతడు - చేర్చుకొనుచు మీ కిచ్చును - చీర జీవము కృపను (2) ||హృదయ|| అతడు తప్పక కలుగజేయు - నఖిల భాగ్యములు మీర - లతని హత్తుకొందు రప్పు - డానందము తోడ (2) ||హృదయ|| బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించు చూడు గాన - బ్రతికి యుండు కాలముననే - ప్రభుని గొలువండి (2) ||హృదయ||