Praise

హల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో

Halleluuya Paatalatho Aananda Geethaalatho

Watch on YouTube
హల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో (2) కృపామయుండా నీ మేలులన్ని స్మరించి స్తుతింతును (2) నేనారణ్యా యానములో నిను పలుమార్లు విసిగించినా (2) కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నను మరువక మన్నాను నాకిడితివి (2) ||హల్లెలూయ|| మలినంబైన వలువలతో నే నీ ఎదుట నిలుచుండగా (2) కృపతో నా నేరములను క్షమియించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివి (2) ||హల్లెలూయ|| నే కృంగిన వేళలలో నీ అభిషేక తైలముచే (2) పక్షిరాజు యవ్వనము వలె నా బలము నూతనము జేసితివి నను పైకెగుర జేసితివి (2) ||హల్లెలూయ||