హల్లెలూయ పాట - యేసయ్య పాట
పాడాలి ప్రతి చోట - పాడాలి ప్రతి నోట
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4)
||హల్లెలూయ||
కష్టాలుయే కలిగినా - కన్నీరుయే మిగిలినా (2)
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2)
||హల్లెలూయ||
చెరసాలలో వేసినా - సంకెళ్లు బిగియించినా (2)
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2)
||హల్లెలూయ||
నీ తల్లి నిను మరిచినా - మరువడు నీ దేవుడు (2)
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2)
||హల్లెలూయ||
శోధనలు నిను చుట్టినా - సంతోషమే తట్టినా (2)
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2)
||హల్లెలూయ||
సింహాల కెరవేసినా - అగ్నిలో పడవేసినా (2)
ధీరుడవై సాగుమా - ప్రభు సిల్వనే చాటుమా (2)
||హల్లెలూయ||