Easter

గీతం గీతం జయ జయ గీతం

Geetham Geetham Jaya Jaya Geetham

Watch on YouTube
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) ||గీతం|| చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు ||గీతం|| వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ||గీతం|| అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి ||గీతం|| గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి ||గీతం||