Thanksgiving

గతకాలమంత నీ నీడలోన

Gathakaalamantha Nee Needalona

Watch on YouTube
గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు - కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన - పొగడనా వేనోళ్ళన - (2) వందనం యేసయ్యా - ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| ఎన్నెన్నో అవమానాలెదురైననూ నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగిననూ నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్యా - ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| మాటలే ముళ్ళుగ మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నను తాకెనయా నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) వందనం యేసయ్యా - ఘనుడవు నీవయ్యా (2) గతకాలమంత నీ నీడలోన - దాచావు దేవా వందనం కృప చూపినావు - కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన - పొగడనా వేనోళ్ళన - (2) వందనం యేసయ్యా - విభుడవు నీవయ్యా (2) ||గతకాలమంత||