Second Coming

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని

Gaganamu Cheelchukoni Ghanulanu Theesukoni

Watch on YouTube
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానైయున్న ప్రాణప్రియుడా యేసయ్యా (2) నిన్ను చూడాలని… నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2) ఉల్లసించుచున్నది… ||గగనము|| నీ దయా సంకల్పమే - నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2) పవిత్రురాలైన కన్యకగా - నీ యెదుట నేను నిలిచెదను (2) నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) ||గగనము|| నీ మహిమైశ్వర్యమే - జ్ఞాన సంపదనిచ్చినది మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2) కళంకములేని వధువునై - నిరీక్షణతో నిన్ను చేరెదను (2) యుగయుగాలు నీతో ఏలెదను (2) ||గగనము|| నీ కృపా బాహుళ్యమే - ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2) అక్షయమైన దేహముతో - అనాది ప్రణాళికతో (2) సీయోనులో నీతో నేనుందును (2) ||గగనము||