Thanksgiving

గడిచిన కాలమంతా నను నడిపిన నా దేవా

Gadichina Kaalamanthaa Nanu Nadipina Naa Devaa

Watch on YouTube
గడిచిన కాలమంతా - నను నడిపిన నా దేవా నీ కంటి పాప లాగా - కాపాడిన నా ప్రభువా (2) మరో యేడు నాకొసగినందుకు - నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు - నిన్నేమని కీర్తింతును (2) ||గడిచిన|| ఇచ్చిన వాగ్ధానం మరువక - నిలుపు దేవుడవు శూన్యమందైనా సకలం - సాధ్యపరచెదవు (2) నా మేలు కోరి నీ ప్రేమతో - నను దండించితివి చెలరేగుతున్న డంభమును - నిర్మూలపరచితివి (2) ||మరో యేడు|| నాదు కష్ట కాలములోన - కంట నీరు రాకుండా నాదు ఇరుకు దారుల్లోన - నేను అలసిపోకుండా (2) నా సిలువ భారం తగ్గించి - నీవేగా మోసితివి నీ ప్రేమతో పోషించి - సత్తువ నింపితివి (2) ||మరో యేడు||