Good Friday

గాయపడిన నీ చేయి చాపుము దేవా

Gaayapadina Nee Cheyi Chaapumu Devaa

Watch on YouTube
గాయపడిన నీ చేయి చాపుము దేవా నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2) సిలువే నాకు విలువైనది (2) అదియే నా బ్రతుకున గమ్యమైనది ఎంతో రమ్యమైనది ||గాయపడిన|| ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె నీవు ఎదిగితివి (2) సురూపమైనా ఏ సొగసైనా (2) లేనివానిగా నాకై మారితివి ||గాయపడిన|| మనుషులందరు చూడనొల్లని రూపముగా నాకై మారితివి (2) మా రోగములు మా వ్యసనములు (2) నిశ్చయముగా నీవు భరియించితివి ||గాయపడిన|| నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత నాకు కలిగినది (2) నీవు కార్చిన రక్తమే (2) మా అందరికీ ఇల ప్రాణాధారము ||గాయపడిన||