Worship

ఎవరూ సమీపించలేని

Evaru Sameepinchaleni Thejassutho Nivasinchu Naa Yesayyaa

Watch on YouTube
ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) ||ఏమౌదునో|| ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో|| పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2) పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో|| జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా (2) ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||