Worship

ఎంతో సుందరుడమ్మ తాను

Entho Sundarudamma Thaanu

Watch on YouTube
ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2) ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2) మరులు మనసున నింపు మహనీయుడాతండు (2) సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2) విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు (2) విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2) కలుషము కడిగిన కమలాల కనుదోయి (2) విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2) చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2) ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2) బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు (2) అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2) ఆతని నొరతి మధురంబు మధురంబు (2) ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||