ఈ ఉదయం - శుభ ఉదయం
ప్రభువే నాకొసగిన - ఆనంద సమయం
ఆశ్రయించెదన్ - దివ్య వాక్యమున్
ప్రేమతోడ సరిచేసే - శ్రేష్ఠ సత్యమున్
||ఈ ఉదయం||
బలహీనమైతి నేను - బలపరచుము తండ్రి
ఫలహీనమైతి నేను - ఫలియింపజేయుము
వాక్య ధ్యానమే - నీ ముఖ దర్శనము
పరిశుద్ధ పరచెడి - పరమతండ్రి మార్గము
||ఈ ఉదయం||
అస్థిరమునైతి నేను - స్థిరపరచుము తండ్రి
అల్పవిశ్వాసి నేను - అద్దరికి జేర్చుము
నీ పాదసన్నిధే - నాకు శరణము
అభయంబునిచ్చెడి - ఆశ్రయపురము
||ఈ ఉదయం||
