Prayer

ఈ సాయంకాలమున యేసు ప్రభో వేడెదము

Ee Saayankaalamuna Yesu Prabho Vededamu

Watch on YouTube
ఈ సాయంకాలమున - యేసు ప్రభో వేడెదము నీ సుదయారస మొల్క - నిత్యంబు మముగావు ||ఈ సాయంకాలమున|| చెడ్డ కలల్ రాకుండ - నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో - భీతి బాపుము తండ్రీ ||ఈ సాయంకాలమున|| దుష్టుండౌ శోధకుని - ద్రోక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము - పడకుండ గాపాడు ||ఈ సాయంకాలమున|| నీ యేక పుత్రుండౌ - శ్రీయేసు నామమున సాయం ప్రార్థన లెల్ల - సరగ నాలించుమా ||ఈ సాయంకాలమున|| జనక సుత శుద్ధాత్మ - ఘన దేవా స్తుతియింతుం అనిశము జీవించి - రా - జ్యంబు జేయు మామేన్ ||ఈ సాయంకాలమున||